స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 19 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. మరోవైపు అయన బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇవాల్టితో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. ఈనేపథ్యంలో బాబు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో మరికొన్ని రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. అయితే, ఆరోజు విచారణ సందర్భంగా ఇరు వైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాబు బెయిల్ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయం రేపు తేలనుంది.
