Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సూర్య కొత్త మూవీ కంగువ పోస్టర్ విడుదల

గజిని సినిమాలో తన నటన తో ప్రేక్షకులను ఆకట్టు కున్న సూర్య ఆ తరువాత బ్రదర్స్ , 7th సెన్స్ , సింగం సినిమాలతో ఆకట్టుకున్న
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇక సూర్య నటిస్తున్నకొత్త మూవీ ‘కంగువ’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. తమిళ న్యూ ఇయర్ ‘పూతండు’ ఫెస్టివల్ సందర్భంగా ‘కంగువ’ సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్‌గా సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్‌‌ను పోస్టర్‌గా డిజైన్ చేసి వదిలిన ఈ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అని ఈ పోస్టర్‌లో క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది.

‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమానుభారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

RSS
Follow by Email
Latest news