Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ..!

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్బంగా వేములవాడ పట్టణ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు పాల్గొని మన జాతీయ జండా ను ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. భారత దేశ ప్రతి ఒక్క పౌరుడు జాతీయభావాన్ని కలిగి ఉండాలని ఆమె అన్నారు. బోలో స్వతంత్ర భారత్ కి జే, జై జవాన్ జై కిసాన్, హర్ ఘర్ తిరంగా నినాదాలతో ప్రారంభమైన ఈ ర్యాలీ ఈద్గా మైదానం, కోరుట్ల బస్టాండ్, రాజన్న ఆలయం ముందర నుండి తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ముగిసింది.

అనంతరం పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు అక్రమ్ మాట్లాడుతూ..స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.మనమందరం ఐక్యమత్యంగా ఉండడం ద్వారానే భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా,శక్తివంతమైన దేశంగా ఉందని కొనియాడారు.

మహానుభావుల జీవిత చరిత్రలు చదివి వాళ్ళ ఆశయాలకు అడుగులు వేయాలని సూచించారు. మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం వెనుక ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగం ఉన్నదని కొనియాడారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎందరో ముస్లిం సోదరులు ప్రాణత్యాగం చేశారని అన్ని కులాలు , మతాలు ఒకటేనని అందరూ సమానమే అని అన్నారు. ర్యాలీని విజయవంతం చేసిన సోదరులకు,సహకరించిన పోలీసులకు,మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం, జయ సలీం మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ షేక్ బాబున్, మార్కెట్ కమిటీ, డైరెక్టర్ పీరు మొహమ్మద్, జర్నలిస్టులు లాయక్ పాషా, మన్నాన్,కలీం పాషా, సయ్యద్ పాషా, రసూల్, ఖాజా నైముద్దీన్, ముస్లిం కమిటీ కార్యదర్శి వలి మహమ్మద్, ముస్లిం నాయకులు అంజద్ పాషా, షేక్ రియాజ్, అబ్దుల్ రఫీఖ్, ముస్లిం కమిటీ అధ్యక్షులు షేక్ ఇమామ్ అబ్దుల్ రజాక్ బషీర్, సయ్యద్ కరీం, , ప్రధాన కార్యదర్శి అజ్మత్అలీ , అబ్దుల్ రఫీక్ , ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news