Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణలోని నిరుద్యోగులకు నూతన సంవత్సరంలో శుభవార్త…

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) నూతన సంవత్సరం ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం… డిగ్రీ కళాశాలలకు సంబంధించి 544 పోస్టులు, మున్సిపల్ శాఖలో 78 పోస్టులు… ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 71 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పూర్తి వివరాలు టీఎస్ పీఎస్ సీ వెబ్ సైట్ (tspsc.gov.in) లో ఉన్నాయి.

మున్సిపల్ శాఖలో ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే, లేదా జూన్ లో పరీక్ష ఉంటుంది.

 

 

RSS
Follow by Email
Latest news