Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ లో ప్రారంభమైన పోలింగ్‌

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ లో గురువారం పోలింగ్‌ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. బెంగాల్‌లో తృణమూల్, భాజపా మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా.. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ నెలకొంది.

పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.85 కోట్ల మంది పురుషులు ఉండగా, 1.75 కోట్ల మంది మహిళలున్నారు.  ఇక, తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.83 కోట్ల మంది పురుషులుండగా, 2.93 కోట్ల మంది మహిళలున్నారు.

RSS
Follow by Email
Latest news