Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పోలింగ్ జరుగుతున్న భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక

భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌, పోలింగ్ నేడు (శ‌నివారం) జ‌ర‌గ‌నుంది. ఈరోజు  ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం మై  సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ముగియనుంది. పార్ల‌మెంటు భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులోని 63వ నెంబ‌రు గ‌దిలో ఈ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంట‌నే ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్న ఎన్నిక‌ల సంఘం రాత్రికి ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌నుంది.

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌లో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన మొత్తం 790 మంది ఎంపీలు ఉండగా,  ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌ల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నేప‌థ్యంలో రేప‌టి ఉప‌రాష్ట్రప‌తి పోలింగ్‌కు 788 మందికి మాత్ర‌మే తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

RSS
Follow by Email
Latest news