తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 22,662 కరోనా పరీక్షలు నిర్వహించగా, 219 కొత్త కేసులు నమోదైనాయి.. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 76 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల వివరాలు :
జీహెచ్ఎంసి – 164
ఆదిలాబాద్ – 0
భద్రాద్రి కొత్తగూడెం – 4
జగిత్యాల – 4
జనగామ – 0
జయశంకర్ భూపాలపల్లి – 0
జోగులాంబ గద్వాల – 0
కామారెడ్డి – 0
కరీంనగర్ – 0
ఖమ్మం – 1
కొమురం భీం ఆసిఫాబాద్ – 0
మహబూబ్ నగర్ – 0
మహబూబాబాద్ – 0
మంచిర్యాల – 0
మెదక్ – 0
మేడ్చల్ మల్కాజ్ గిరి – 11
ములుగు – 0
నగర్ కర్నూల్ – 0
నల్గొండ – 2
నారాయణ పేట్ – 0
నిర్మల్ – 0
నిజామాబాద్ – 0
పెద్దపల్లి – 1
రంగారెడ్డి – 19
సంగారెడ్డి – 9
సిద్దిపేట – 0
సూర్యాపేట – 2
వికారాబాద్ – 0
వనపర్తి – 0
వరంగల్ రురల్ – 0
హన్మకొండ – 2
యాదాద్రి భువనగిరి – 0
తెలంగాణలో ఇప్పటిదాకా 26,551 కేసులు యాక్టివ్‌గా ఉండగా… వీరిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 54,277 కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 33,46,472కు పెరిగింది.