Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ.. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టిపిసిసి పిలుపుమేరకు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ మహాలక్ష్మి గుడి నుండి రామ్ మందిర్ విధిగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆలయ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసులను కాపాడాలని ధరణి వ్యవస్థను రద్దు చేయాలని అయన కోరారు.  అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలని, రైతులకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లాల వద్ద వడ్లు కొనుగోలు చేస్తూ… తరుగు కింద ఐదు కిలోలు 7 కిలోలు తరుగు తీస్తూ… రైతులను దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దళారుల మోసాలను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని, వారి చేతిలో మోసపోయిన రైతులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వేములవాడ కాంగ్రెస్ పట్టణ మండలనాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పాల్గొన్న రైతులకు, భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలకు శ్రీనివాస్  కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకట్ స్వామి మాట్లాడుతూ…  రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. దీనిని ప్రజలు గమనించాలని అయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతన్నకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, ఫిరోజ్ బాషా, జడ్పిటిసి నాగం కుమార్ కర్ణాకర్, పాత సత్యలక్ష్మి, చిలక రమేష్, బొజ్జ భారతి, నాగుల రాము, చిలకల తిరుపతి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news