Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

“కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్… క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్”

ఖమ్మం కుర్రాడు నవీన్ ముళ్ళంగి
ఆంగ్లంలో తీసిన పాన్ వరల్డ్ మూవీ
“కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్
క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్”

“మనం సినిమాలు తెలుగులోనే
ఎందుకు తీయాలి??
ఇంగ్లీషులో తీసి మనమూ
ఎందుకు వందల కోట్లు
సంపాదించకూడదు??”
అంటున్న పాతికేళ్ల చిచ్చరపిడుగు!!

“మన తెలుగు సినిమాలు వంద కోట్లు సంపాదిస్తేనే ఎగిరి గంతేస్తున్నాం. కానీ.. ఇంగ్లీష్ సినిమాలు వేల, లక్షల కోట్లు గడిస్తుండడం నుంచి మనం స్ఫూర్తి పొందలేకపోతున్నాం” అంటున్నాడు తెలంగాణ చిచ్చరపిడుగు నవీన్ ముళ్లంగి. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఈ పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు… తనే “హీరో కమ్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్”గా ఇంగ్లీషులో ఓ ఫీచర్ ఫిల్మ్ చేసి ట్రెండ్ సెట్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు.

పరస్పర విరుద్ధమైన భావజాలం కలిగిన ఓ అబ్బాయి – అమ్మాయి నడుమ నడిచే యునీక్ లవ్ స్టోరీగా “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ – క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్” పేరుతో నవీన్ ముళ్ళంగి తీసిన ఈ చిత్రం షూటింగ్ తోపాటు… పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేసుకుంది. గంటన్నర నిడివి గల ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఓ సినిమా రూపకల్పనకు అవసరమైన పలు సాంకేతిక అంశాల్లోనూ సుశిక్షితుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్న నవీన్… ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఇంగ్లీషులో సినిమాలు తీసి… తన సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

“వాటర్ ఎంటర్టైన్మెంట్స్” పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ… గత కొన్నేళ్లుగా మంచి సంపాదన మరిగిన నవీన్ ముళ్ళంగి… అదే పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి… రూపొందించిన “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ – క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్” చిత్రంలో నవీన్ సరసన ‘శివ ప్రీతిక సుక్క’ అనే చక్కని చుక్క హీరోయిన్ గా నటించింది. ఇలియాాజ్ సినిమాటోగ్రఫీ అందించారు!!

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌