భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈనెల 20న భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలో పర్యటిం చనున్నారు. ఈ నేపథ్యం లో కాటారం మండలం నస్తూరిపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శుక్రవారం సాయంత్రం ఐ డి ఓ సి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్ పి సిరీశెట్టి సంకీర్త్, భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ తో పాటు.. భూపాలపల్లి జిల్లా అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళే శ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కట్టమని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ సరిగ్గా 2023 ఎన్నికల సమయం లో ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభు త్వం భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్, బీజే పీ పార్టీలు ఇప్పటికీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా యి. అయితే ఈ ఆరోప ణలను బీఆర్ఎస్ ఖండిస్తోంది.
అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్..విచారణ జరిపి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ఈ కమిషన్ ఏర్పాటు, అది సమర్పిం చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానికి సంబంధించిన తుది తీర్పు త్వరలోనే వెల్లడి కానుంది.
ఈ క్రమంలో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని స్వయంగా పరిశీలించనున్నారు. గతంలో కుంగిపోయిన ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన..పిల్లర్లను పరిశీలించి.. పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అదే సమయంలో కాళే శ్వరం పరిధిలోని గోదావరి నది వద్ద నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్క రాల ఏర్పాట్లపైనా సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయనున్నారు.











