Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

“తెలుగు యువత”ఆధ్వర్యంలో “కొవ్వొత్తుల ర్యాలీ..

“తెలుగు యువత” మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున గారి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం, ECIL X Roads లో “కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే వరంగల్ లోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా ఆత్నాహత్య చేసుకున్న డా॥ ప్రీతి మరియు రక్షిత ల ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ  ర్యాలీ నిర్వహించారు. అలాగే, రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కందికంటి అశోక్ కుమార్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు, రాష్ట్ర TNTUC కార్యక్రమాల కార్యదర్శి పసల ప్రసాద్, రాష్ట్ర TNSF ఉపాధ్యక్షులు శివానంద్, రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఆశా బిందు, తెలుగు యువత నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, తెలుగు యువత ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు హేమంత్ గౌడ్, నాయకులు సంతోష్ సాగర్, వేంకటేశ్వర రావు, రామ్మోహన్, డా॥ అశోక్, తెలుగు యువత నాయకులు మౌలా అలీ, అంకమ్మ రావు, వేంకటేశ్, రమణ, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు!

RSS
Follow by Email
Latest news