Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీలో ప్లాస్టిక్ వినియోగం పై నిషేధం…. భారీగా జరిమానాలు…

ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంపై భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన మార్గదర్శకాలకు సంబంధించి అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించే వీధి వ్యాపారులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తి, దిగుమతిపై తొలిసారి పట్టుబడితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. అదే విధంగా రెండోసారి పట్టుబడిన వారికి ఏకంగా రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు.

అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిలువ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా సీజ్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేజీకి రూ.10 చొప్పున అదనపు జరిమానా విధిస్తారు. ఆయా సంస్థలు, మాల్స్… సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే.. రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా విధించనున్నారు.

RSS
Follow by Email
Latest news
కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి..