Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి

మరోసారి బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి చేసారు. అది కూడా పోలీసుల ఉండగానే..పోలీస్ వాహనంలో ఉన్న  నరేష్ ఫై దాడి చేసారు. నరేష్ కొద్దీ రోజుల క్రితం అయ్యాప్పస్వామి ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు ఆయనపై మండి పడ్డాయి. ఆయనను  కఠినంగా శిక్షించాలని ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేసారు. ఈ మధ్యనే కొడంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అతడు బయటకొచ్చాడు.

తాజాగా మరోసారి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో మరోసారి అయ్యప్ప భక్తులు ఆగ్రహం తో ఉన్నారు. ఇదే క్రమంలో పోలీసులు నరేష్ ను వెహికలు తీసుకెళ్లడం చూసిన కొంతమంది భక్తులు వెహికలును వెంబడించి, నరేష్ ను కిందకు లాగి దాడి చేశారు.

మరోవైపు దీనిపై నరేశ్ స్పందిస్తూ… తనపై దాడి చేస్తారనే పోలీసుల రక్షణను అడిగానని… పోలీసుల వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని చెప్పాడు. పోలీసుల వాహనంలో వెళ్తుంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. తనకు గన్ లైసెన్స్ కావాలని కోరాడు. ఇక దాడికి సంబదించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

RSS
Follow by Email
Latest news