Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణాలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీసు శాఖతోపాటు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా… అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుద చేసింది. రవాణా శాఖ పరిధిలో మొత్తంగా 113 ఏఎంవీఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్ పీఎస్సీ) కార్యదర్శి  బుధవారం వెల్లడించారు.

అభ్యర్థుల అర్హతలు, ఇతర అంశాలు, నోటిఫికేషన్  పూర్తి వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ www.tspsc.gov.in లో పొందవచ్చని తెలిపారు. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. ఈ పోస్టులకు ఆగస్టు 5 వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించారు.

RSS
Follow by Email
Latest news