Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపి టీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఈరోజు రాశి ఫలాలు..

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️

🚩(17-07-2022) రాశి ఫలితాలు🚩

మేషం
17-07-2022

ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.
—————————————
వృషభం
17-07-2022

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు
సఫలమవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
—————————————
మిధునం
17-07-2022

మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.
—————————————
కర్కాటకం
17-07-2022

స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది.
—————————————
సింహం
17-07-2022

ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
—————————————
కన్య
17-07-2022

ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలున్నాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.
—————————————
తుల
17-07-2022

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి.
—————————————
వృశ్చికం
17-07-2022

నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు.
—————————————
ధనస్సు
17-07-2022

నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆలోచనలో ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
—————————————
మకరం
17-07-2022

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.
—————————————
కుంభం
17-07-2022

ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
—————————————
మీనం
17-07-2022

పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
—————————————
🍁 శుభం భూయాత్ 🍀 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌