Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️

🚩(12-07-2022) రాశి ఫలితాలు🚩

మేషం
12-07-2022

దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వాహన సంభందిత వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
—————————————
వృషభం
12-07-2022

భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.
—————————————
మిధునం
12-07-2022

వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల ఆదరణ పొందుతారు. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
—————————————
కర్కాటకం
12-07-2022

సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
—————————————
సింహం
12-07-2022

ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ వాహన సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.
—————————————
కన్య
12-07-2022

వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది.
—————————————
తుల
12-07-2022

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
—————————————
వృశ్చికం
12-07-2022

దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి.
—————————————
ధనస్సు
12-07-2022

ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
—————————————
మకరం
12-07-2022

నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
—————————————
కుంభం
12-07-2022

సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి.
—————————————
మీనం
12-07-2022

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
—————————————
🍁శుభం భూయాత్☘️🔹 ముక్తినూతలపాటి వాసు 🔹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest news