Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణలో మరో 86 కొత్త జూనియర్ కాలేజీలు

తెలంగాణలో మరో 86 కొత్త జూనియర్ కాలేజీలు రానున్నాయి. అయితే, ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా మారచనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటిని అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ వివిధ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ల ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించి, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు.  అనంతరం సీఎస్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను జిల్లాకు ఒకటి చొప్పున శాశ్వతంగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. వీటికి సంబంచిన నివేదికలు తయారు చేసి, ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో వీటిపై చర్చిస్తామని సోమేశ్ కుమార్ తెలిపారు.

RSS
Follow by Email
Latest news