Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మెగా ఫ్యామిలీ కోడలు కాబోతున్న యాంకర్‌ మేఘన..!

యాంకర్ మేఘన అంటే నిన్న, మొన్నటి వరకు కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఆమె ఎంగేజ్ మెంట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వార్తల్లో నిలిచింది. అందుకు కారణం మెగా ఫామిలీ ఇంటికి కోడలు కావడమే. కొణిదెల పవన్‌ తేజ్‌ను ఆమె వివాహం చేసుకోబోతుంది. గురువారం వీరి నిశ్చితర్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ హాజరయ్యి. కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించారు. వీరి నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి యాంకర్‌ మేఘన మీద పడింది. ఇంతకు ఎవరా మేఘన అని నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు.

యాంకర్‌ మేఘన స్వస్థలం కాకినాడ. ఆమె తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నత స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక మేఘన జన్మించింది హైదరాబాద్‌లో. కానీ కాకినాడలో ఆమె బాల్యం గడిచింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే.. ఈవెంట్స్‌కి యాంకరింగ్‌ చేసేది. సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తొలిసారి హెచ్‌బీడీ హ్యాక్డ్‌ బై డెవిల్‌ చిత్రం ద్వారా మేఘన టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత  “ఈ కథలో పాత్రలు కల్పితం” సినిమాలోమెగా హీరో పవన్‌ తేజ్‌కు జోడిగా 2021లో నటించింది. అప్పుడు వీరి మధ్యన ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇది మేఘన పెళ్లి అసలు రహస్యం.

RSS
Follow by Email
Latest news