Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాబూల్‌లో భారీ పేలుడులో 66 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ లో భారీ పేలుడు సంభవించింది. ఖలీఫా సాహిబ్ మసీదులో జరిగిన ఈ ఘటనలో 66 మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రంజాన్ చివరి శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం  మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని, అలాగే, మసీదు పైకప్పు కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సున్నీ ముస్లింలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. రంజాన్ పర్వదినం ఏంటో సంతోషంగా జరుపుకోవాల్సిన పలువురు ప్రజలు అసువులుబాయడం బాధాకరం అంటూ…ఆవేదన వ్యక్తం చేసింది.కాగా, ఈ పేలుడు ఘటనపై ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ స్పందించలేదు. కాగా, ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్