Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న కంటికి వెలుగు

కంటి వెలుగు కార్యక్రమాన్ని ఓ యజ్ఞం లా సీఎం కేసీఆర్ చేపట్టారని, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.  వరంగల్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అద్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని అధునాతన పరి కరాలతో, నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించి, బాధితులకు  ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు… వృద్ధులు, పిల్లలు, పెద్దలు, జర్నలిస్టులు సైతం ఉపయోగించుకోవడం ఆనందదాయకం అన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అందత్వ నిర్మూలన కోసం ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో వరంగల్ హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యు లు కంటి వెలుగులో భాగస్వా ములై ప్రతి ఒక్కరూ వినియోగిం చుకోవాల ని ఈ సందర్భంగా ఆయ న కోరారు విధుల్లో భాగంగా జర్నలి స్టులుతమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ సూచించారు.

ఈ కార్యక్రమంలోకుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ డిప్యూటీ డిఎంహెచ్ఒ మదన్ మోహన్, ఐఅండ్ పిఆర్ ఏడి లక్ష్మణ్ కుమార్, కార్పరేటర్ కోమల కిషన్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్లె అమర్, టీయూడబ్ల్యూజేే జిల్లా కార్యదర్శి తోట సుధాకర్, రాష్ట్ర నాయకులు గడ్డం కేశవమూర్తి, పి. కొండల్ రావు, టి ఏ జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూటెంకి ప్రభాకర్, గాడిపెల్లి మధు, వల్లాల వెంకటరమణ, పిన్నా శివకుమార్, డబ్ల్యూ జేఎఫ్ నాయకులు బి. దయాసాగర్, టి యు డబ్ల్యూ జే హెచ్ 143 హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎం సుధాకర్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జి శ్యాం కుమార్, కొండపల్లి దుర్గాప్రసాద్, బుడిగ శీను, అల్లం రాజేష్ వర్మ, యాంసాని శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు నరేందర్, సంపెట సుధాకర్, వర ప్రసాద్ వీ సుధాకర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ కార్యవర్గ సభ్యులు వి హరీష్ గౌడ్ జీ.దిలీప్ డీ శ్రీకాంత్ న్ భారత్ కే వేణుగోపాల్ ఏం.రాజు జే అంజి నయీం విజయ్ రాజ్ కే సంజీవయ్య పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news