Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి విశేష ఉత్సవాల వివరాలు

👉 మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలు :

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

 ఏరోజు ఏ ఉత్సవాలు :

👉మే 1న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగుతుంది.

👉మే 8, 15 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు.

👉మే 9న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

👉మే 12న హనుమజ్జయంతి జరుపుకుంటారు.

👉మే 18న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతారు. అదే రోజు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

👉మే 21 నుండి 30వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవాలు జరుగుతాయి.

👉మే 22న శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.

👉మే 23 నుండి 31 వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, 23న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

👉మే 27న గరుడవాహనం, మే 30న రథోత్సవం నిర్వహిస్తారు.

👉మే 31న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 🙏🙏

RSS
Follow by Email
Latest news