ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 24) ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 03 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీకి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సుదర్శన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఈ మ్యాచ్‌లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఐపీఎల్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడిన సుదర్శన్ ఆర్సీబీ బౌలర్లకు చెమటలు పట్టించాడు.
అనంతరం ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆర్సీబీ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లి, పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. కోహ్లి 44 బంతుల్లో 81 పరుగులు.. పడిక్కల్ 27 బంతుల్లో 55 పరుగులు బాదారు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది 5వ విజయం. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో 2వ స్తానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ ఓటమి. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఊపు మీద కనిపించిన గుజరాత్.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది.











