తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ఉన్నారు. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సీవీ ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన బదిలీల్లో ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.











