Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ ల బదిలీ

తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేశారు. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్, విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్, మల్టీజోన్-2 ఐజీగా షానవాజ్ ఖాసిం నియమితులయ్యారు. షానవాజ్ ఖాసింకు పోలీసు పర్సనల్ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా తరుణ్ జోషి, డ్రగ్స్ కంట్రోల్ డీజీగా అవినాష్ మొహంతి నియమితులయ్యారు. ఏసీబీ డైరెక్టర్ గా అవినాష్ మొహంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్కాజిగిరి పోలీసు కమిషనర్ గా బి.సుమతికి బాధ్యతలు అప్పగించారు. ఐజీ కార్తికేయకు ఎస్ఐబీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

RSS
Follow by Email
Latest news