Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అన్నవరం ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు (శుక్రవారం )  జరిగింది. వంశ పారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ ఐ.వి.రోహిత్ తోపాటు ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యులు, నలుగురు ప్రత్యేక ఆహ్వానితులతో ఈవో చక్రధరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు వరుపుల సత్య ప్రభ, జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర రావు పాల్గొన్నారు.  అనంతరం ఛైర్మన్ రోహిత్ అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఆలయ అభివృద్ధికి అంతా కృషి చేయాలని సూచించారు.

RSS
Follow by Email
Latest news