Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగులతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభిషేక్ మెరుపు తో సన్‌రైజర్స్ జట్టు 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా  బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్, అభిషేక్ శర్మ విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అభిషేక్ శర్మను నిలువరించడం ఢిల్లీ బౌలర్లకు ఏ దశలోనూ సాధ్యం కాలేదు.

అనంతరం 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 107 పరుగులతో పటిష్ఠంగా కనిపించింది. కానీ, శ్రీలంక బౌలర్ ఇషాన్ మలింగ మ్యాజిక్ తో (4/32), ఢిల్లీ మిడిల్ ఆర్డర్ వెన్ను విరిచాడు. మలింగ కు తోడుగా షకీబ్ హుస్సేన్ (1/29) రాణించడంతో అదే స్కోరు వద్ద వరుసగా వికెట్లు కోల్పోయి కోలుకోలేకపోయింది. చివరికి 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానానికి ఎగబాకి తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

RSS
Follow by Email
Latest news