Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కోహ్లీ లైక్ తో ఒక్క రోజులో పాపులరైన అమ్మాయి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టినందుకు పెద్ద దుమారానికి దారితీసింది. జర్మనీకి చెందిన మోడల్‌ లిజ్లాజ్‌ (LizLaz) ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు కోహ్లీ ‘లైక్’ కొట్టారు. దింతో జర్మనీ మోడల్‌ లిజ్లాజ్‌ ఒక్క రోజులో పాపులరైంది. క్షణాల్లో ఈ స్క్రీన్‌షాట్లు ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ అనూహ్య పరిణామంపై లిజ్లాజ్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అసలు కోహ్లీ తన పోస్ట్‌ను లైక్ చేసిన విషయం కూడా తనకు వార్తల ద్వారానే తెలిసిందని లిజ్లాజ్‌ తెలిపారు. “నేను నిద్రలేచేసరికి వార్తల్లో అంతటా నేనే ఉన్నాను. చాలా మంది దీనికి సంబంధించిన ఆర్టికల్స్‌ను నాకు పంపించారు. నాకు లెక్కలేనన్ని మెసేజ్‌లు వచ్చాయి” అని ఆమె తెలిపారు.

కోహ్లీ తన పోస్ట్‌ను లైక్ చేయడం చూసి చాలా సంతోషపడ్డానని తెలిపారు. అయితే, ఆ తర్వాత ఈ విషయం ఇంత పెద్దది కావడంతో కాస్త ఇబ్బందిగా అనిపించింది, “నిజానికి, ఆయన పరిస్థితి చూస్తే నాకు జాలి వేసింది. ఆయన నా పోస్ట్‌ను లైక్ చేయడం నాకు ఆనందాన్నిచ్చింది. కానీ, ఈ విషయం ఇంత పెద్ద వార్త ఎలా అయిందో అర్థం కావడం లేదు. దీన్ని వాళ్లు ఎలా గమనించారు? ఎలా వార్తగా మార్చారు? ఆయన ఉద్దేశం బహుశా అది కాకపోవచ్చు. అయినా ఆయన మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె వివరించారు.

RSS
Follow by Email
Latest news