Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన న్యూ ఫీచర్‌ ..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ చాలా సంవత్సరాలుగా ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది. యూజర్ల ప్రైవసీని పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఇప్పటికే టెలిగ్రామ్ వంటి యాప్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ రాకతో, తెలియని వ్యక్తులతో లేదా వ్యాపార అవసరాల కోసం ఫోన్ నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం ఉండదు.

ఈ ఫీచర్‌ రాకతో ఇకనుండి ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఇతరులతో చాట్ చేయడానికి, కాల్స్ చేయడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొంతమంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ అప్‌డేట్‌ను విడుదల చేసినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో దశలవారీగా అందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం పరిమిత సంఖ్యలో యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకుని, ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ విడుదలపై మాతృసంస్థ మెటా గానీ, వాట్సాప్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యూజర్‌నేమ్‌ 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండాలి. కేవలం ఇంగ్లీష్ చిన్న అక్షరాలు (a-z), అంకెలు (0-9), చుక్క (.), అండర్‌స్కోర్ (_) మాత్రమే వాడటానికి అనుమతి ఉంటుంది.

RSS
Follow by Email
Latest news