Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. రద్దీ తగ్గడంతో సామాన్య భక్తులకు దర్శనం వేగంగా జరుగుతోంది.

ముందు రోజుతో పోలిస్తే ఈరోజు కాస్త రద్దీ తగ్గింది. దింతో స్వామీ వారు భక్తులు త్వరగా స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న సోమవారం (ఏప్రిల్ 6) శ్రీ వేంకటేశ్వర స్వామిని మొత్తం 77,294 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,796 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీకి కానుకల రూపంలో రూ. 4.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

RSS
Follow by Email
Latest news