Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సర్‌ఛార్జీలని పెంచిన ఎయిరిండియా

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో .. ప్రపంచవ్యాప్తంగా ఫ్లయిట్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని సవరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దేశీయంగా ప్రయాణ చార్జీలకు సంబంధించి, బుధవారం నుంచి ఫ్లాట్ సర్‌ఛార్జీ స్థానంలో… అలాగే దూన్ని బట్టి సర్‌ఛార్జీల ధరల్లో మార్పులు ఉన్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది.

దేశీయ ప్రయాణాలకు 0 నుంచి 500 కిలోమీటర్ల వరకు రూ.299, రూపాయలు వాసులు చేయనున్నారు. 501 నుంచి 1000 కిలోమీటర్ల వరకు రూ.399,1001 నుంచి 1500 కిలోమీటర్ల వరకు రూ.549, అలాగే 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు రూ.749వరకు, 2000 నుంచి అంతకుమించి కిలోమీటర్లకు రూ.899 వసూలు చేస్తారు. దేశీయ ప్రయాణాలకు ఈ సర్‌ఛార్జ్‌ను విధిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

అలాగే అంతర్జాతీయంగా విమాన సర్వీసులు పశ్చిమాసియాకు 50 డాలర్లు, ఆగ్నేయాసియాకు 100 డాలర్లు, సింగపూర్‌కు 60 డాలర్లు, ఆఫ్రికాకు 130 డాలర్లు, యూకేకు 205 డాలర్లు, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు 280 డాలర్ల చొప్పున ఫ్యూయల్ సర్‌ఛార్జిని వసూలు చేయనున్నట్లు ఎయిరిండియా గ్రూప్ తెలిపింది. సవరించిన ఛార్జీలు డొమెస్టిక్ ప్రయాణాలకు ఏప్రిల్ 8వ తేదీ నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు 10వ తేదీ నుంచి వసూలు చేస్తామని తెలిపింది.

RSS
Follow by Email
Latest news