Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి మాట : భగవన్నామ స్మరణ ఎప్పుడు చేయాలి?

” భక్తుడు అనే వాడు సర్వ వేళలందూ విరామము లేక నామస్మరణ చేయాలి !!…”

*కష్టాలు వదలడం లేదని, దుఃఖాలు పోవడం లేదని బాధ పడుతూ కూర్చుంటే కన్నీళ్ళు తప్ప ఇంకేమీ మిగలవు.. లేచి భగవన్నామ స్మరణ చెయ్యి. పంట గింజలు పక్షులు తినేస్తాయని రైతు హో.. హో.. అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకు పక్షులు ఎగిరిపోతాయి. అలానే రామా! కృష్ణా! గోవిందా!! అంటూ భగవంతుని నామస్మరణ చేస్తుంటే కష్టాలు, దుఃఖాలు అవే ఎగిరిపోతాయి.*

చెట్టు నాటిన వెంటనే పండ్లను ఆశించకూడదు, పండ్లు ఎలా ఉండునో అని దాని రుచి తెలుసుకొనుటకై చెట్టు ఆకులూ, బెరడూ నమలకూడదు!!… అలా చేసినయెడల పండు యొక్క మాధుర్యమును తెలియదు… అంతేగాక మొక్క నశించి పోవును… అదే రీతిగా నామమను మొక్కను అభివృద్ధి పరచుకొనుటయే నీ వంతు, దానిని సరిగ్గా చేస్తున్నానా, లేదా; నామములో మహత్తు ఉందా? లేదా? అని ఈ రుచులు చూచుటకు ప్రయత్నించకూడదు…

సందేహించకుండా, తప్పక ఆనామము మొక్కగా, వృక్షమై , భక్తుడు ఆశించిన ఫలమును తిని పించగలదు. అట్టి ఫలము అనేదే నామము, కనుక ఆ నామమును ఎప్పుడు మరువకుండా, దాని రూపమును దృష్టి లో పెట్టు కున్న, అదే ఏకాగ్రత. సర్వ వేళలందూ విరామము లేక నామమును చేయవలెను, అదే జీవితంలో మొదటిపని.

🌸శుభమస్తు🌸
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

RSS
Follow by Email
Latest news