ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా బుధవారం శివధనుర్భంగ అలంకారంలో శ్రీ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత రామయ్యను పట్టు వస్త్రాలు, పుష్ప మాలికలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మాఢ, పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, యువతుల కోలాటాలు, నృత్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.











