Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తమకు యుద్ధంతో సంబంధం లేదు : బ్రిటన్

, నాటో కూటమిలో సభ్యులు తనతో కలవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గత నెల రోజులుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు అమెరికాకు సహకరించడం లేదని ట్రంప్ అఙ్గహం వ్యక్తం చేశారు.

ఇరాన్ యుద్ధంలో యూకే సహకరించడం లేదని ట్రంప్ మండిపడ్డారు. ఇకపై మీ చావు మీరు చావండి అంటూనే, నాటో కూటమి నుంచి వైదొలగాలని అమెరికా భావిస్తోంది. ఇలా భయపెడుతున్నా, ట్రంప్‌ను ధిక్కరిస్తూ బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇరాన్ యుద్ధంలో చేరబోమని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తేల్చి చెప్పాడు.

ఇదే కాకుండా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి గ్లోబల్ హార్ముజ్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇరాన్ యుద్ధం బ్రిటన్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్టార్మర్ హెచ్చరించారు. అంతేకాకుండా ట్రంప్‌కు మరింత కోపం తెప్పించే విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

“నా నిర్ణయాలన్నీ నాదేశ (బ్రిటన్) పౌరుల శ్రేయస్సు కోసమే ఉంటాయి. అందువల్ల, ఇది మన యుద్ధం కాదని, మనం ఇందులో చిక్కుకోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, త్వరలో యూరప్‌ను కూడా ఇరాన్ యుద్ధం ప్రభావితం చేస్తుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) హెచ్చరించింది.

RSS
Follow by Email
Latest news