Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

శీతలా మాతా ఆలయంలో తొక్కిసలాట… 8 మంది మృతి

బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో మంగళవారం నాడు తొక్కిసలాట  జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. నలంద జిల్లాలోని మాఘ్రా గ్రామంలో శీతలా మాతా ఆలయం ఉంది. చైత్రమాసంలో చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.

దింతో ఉన్నట్టుండి భక్తుల మధ్య తోపులాట జరగడంతో పలువురు చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయం, ఆసుపత్రి వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి. మృతులంతా మహిళలేనని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి సంతాపం తెలియజేశారు.

RSS
Follow by Email
Latest news