Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వరంగల్ మేయర్ అభ్యర్థిగా జంగా రాఘవ రెడ్డి…?

వరంగల్ ట్రై సిటీ తోపాటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు చిర పరిచితుడు, కరడు కట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మధ్యనే తిరుగుతూ ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారం చేసే నేత. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి, పగలు అనేక, అర్ధరాత్రి అని చూడకుండా ఆపదలో ఉన్న వారికీ అండగా నిలిచే మంచి మనస్తత్వం కలిగిన ప్రజల మనిషి జంగా రాఘవ రెడ్డి.

పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే నాయకుడని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు సైతం విశ్వసిస్తారు. అందుకు కారణం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పార్టీని అంటి పెట్టుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఫలితంగా ఆయనకు త్వరలో మంచి పదవి దక్కే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ కాబోయే నగర మేయర్ గా జంగా రాఘవ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

దీంతో ఒక్కసారిగా ఓరుగల్లులో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే పార్టీ మారని వైనం.. తన వ్యాపారాలు సైతం మానుకున్నారే తప్ప పార్టీని వీడని రాఘవ రెడ్డి విధేయతకు పట్టం కట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఆయన సేవలు గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేయర్ స్థానంలో జంగా పోటీ చేసేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది .

వరంగల్ లో కాంగ్రెస్ అంటేనే జంగా.. జంగా అంటేనే కాంగ్రెస్ అనే విధంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ పార్టీని పటిష్టం చేసిన రాఘవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించ బోతున్నట్లు విశ్వసినీయ పార్టీ వర్గాల ద్వారా సమాచారం వస్తోంది. గతంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే స్థానం కోసం ప్రయత్నం చేసి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు, జంగా రాఘవరెడ్డి ఎమ్మెల్యే పోటీ నుంచి విరమించుకున్నారు.

పార్టీ తనకు టికెట్ కేటాయించనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నే ఉంటూ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి ఆయనకు రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతను పటిష్టంగా నిర్వర్తిస్తూనే, అభివృద్ధి పథంలో వరంగల్ నగరాన్ని అగ్రస్థానం లో నిలపాలని కృషి చేస్తున్నారు.  అందులో భాగంగానే  రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిని విస్మరిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు పని చేస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేల పరిధిలో గ్రేటర్ వరంగల్ ఉంటుంది. జంగా రాఘవ రెడ్డి అందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల మేయర్ గా ఎన్నికకు మార్గం సుగమం కానుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో పాటూ గ్రేటర్ వరంగల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మద్దతు , ప్రజల మన్ననలు దండిగా ఉన్న జంగా  వరంగల్ మేయర్ పీఠానికి అన్ని విధాలా అర్హతలున్న వ్యక్తిగానే భావించవచ్చు. ఆయన మేయర్ అయితే వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అనడంలో సందేహం లేదు.

RSS
Follow by Email
Latest news