శ్రీరామనవమి సందర్బంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించే భారీ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ యాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లింపు చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే సుమారు 12 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమై… ఈ శోభాయాత్ర సుల్తాన్ బజార్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగే మార్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమయ్యే శోభాయాత్ర మంగళ హాట్ బోయగూడ క్రాస్ రోడ్స్ మీదుగా నాంపల్లి, ధూల్‌పేట్, పురానాపూల్ మీదుగా గాంధీ విగ్రహం, బేగం బజార్ : ఛత్రీ, లోయర్ ధూల్‌పేట్, సిటీ కాలేజీ, నయాపూల్, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి, కోఠి ఆంధ్రా బ్యాంక్ జంక్షన్ మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. కింది ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.











