Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రేపు విడుద ‘యూత్‌‌‌‌’

కెన్ కరునాస్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘యూత్‌‌‌‌’. సూరజ్ వెంజరముడు, దేవదర్శిని చేతన్ కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు. ఈకార్యక్రమంలో హీరోలు శ్రీ విష్ణు, సత్యదేవ్, హీరోయిన్స్‌‌‌‌ అనిష్మ అనిల్ కుమార్,  మీనాక్షి దినేష్,  ప్రియాన్షి యాదవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ట, హసిత్ గోలి, లిరిక్ రైటర్ సనరే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్బంగా హీరో, దర్శకుడు కెన్‌‌‌‌ మాట్లాడుతూ…. తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంతగానో లవ్ చేస్తారని, తమిళంలో ఎలాంటి సక్సెస్ వచ్చిందో, తెలుగులోనూ అదే ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇటీవల​ సూర్య,  కార్తి గార్లను కలిసి మా సినిమా తెలుగులో రిలీజ్‌‌‌‌ చేస్తున్నామని తెలిపామన్నారు. ‘రఘువరన్ బీటెక్’ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రతి ప్రేక్షకుడు మా చిత్రాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు’ అని  తెలిపాడు. నటుడు సూరజ్ వెంజరముడు మాట్లాడుతూ ‘యూత్‌‌‌‌కు నచ్చే సినిమా ఇది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌కు మరింత నచ్చుతుందని అన్నారు.

ఫైట్స్‌‌‌‌,  డ్యాన్స్‌‌‌‌, కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌ ఆకట్టుకుంటాయి’ అని అయన తెలిపారు. తమిళంలో సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని ఒక తెలుగు స్ట్రయిట్‌‌‌‌ సినిమా తరహాలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అయన అన్నారు. ఈచిత్ర నిర్మాతలు సందీప్, వినీత్‌‌‌‌ మాట్లాడుతూ…యూత్, లవర్స్ ని బాగా ఆకట్టుకుంటుందని ,  అలాగే ఫామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రమని నిర్మాతలు అన్నారు.

RSS
Follow by Email
Latest news