టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ ఈ బ్యానర్ నుండి వస్తున్న చిత్రం ‘రాకాస’ త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతోంది. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర నిర్వాహకులు రిలీజ్ చేశారు.
నిహారిక కొణిదెల తన బ్యానర్‌లో కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటారనే నమ్మకం ఉండటంతో ‘రాకాస’పై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భయాన్ని కలిగిస్తూనే, ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘మ్యాడ్’ తర్వాత సంగీత్ శోభన్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమా ఓపెనింగ్స్‌కు ప్లస్ కానుంది. వేసవి కానుకగా ఏప్రిల్ 3వ తేదీన ‘రాకాస’ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాలో కథానాయకుడు సంగీత్ శోభన్ తన ప్రేయసి (నయన్ సారిక) కోసం ఓ ఊరికి వస్తాడు. అయితే, ఆ ఊరిని పీడిస్తున్న రాక్షసుడి ఉచ్చులో హీరో అనుకోకుండా చిక్కుకుంటాడు. పిరికివాడైన హీరో, సీనియర్ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఆ రాక్షసుడిని ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రాణాలను, తన ప్రేయసిని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే ఈ సినిమా అసలు ట్విస్ట్. సంగీత్ శోభన్ తనదైన టైమింగ్‌తో పండించే కామెడీ, బ్రహ్మాజీ మార్క్ హ్యూమర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.











