Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

1:2 బోనస్ ని ప్రకటించిన స్మాల్ క్యాప్ కేటగిరి స్టాక్

టెక్సటైల్ సెక్టార్ కి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరి స్టాక్ R & B Denims Limited Company కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ నిన్న జరిగిన సమావేశంలో తమ షేర్ హోల్డర్స్ కి 1:2 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించింది .  దీనికి సంబందించిన కట్ అఫ్ డేట్ ని ఏప్రిల్ 03 గా నిర్ణయించింది. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం, ఏప్రిల్ 3 లోగ తమ D mat account లో లిస్ట్ అయిన షేర్ హోల్డర్స్ ఉచితంగా 1 ఈక్విటీ షేర్ ని బోనస్ రూపంలో పొందుతారు.

అయితే గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ షేర్ 35 శాతం నష్టాన్ని తమ షేర్ హోల్డర్స్ కి మిగిల్చింది. అలాగే ఈ కంపెనీ గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం జరిగింది. ఆర్&బీ డెనిమ్స్ లిమిటెడ్ అనేది రూ. 100 లోపు ధర కలిగిన ఒక పెన్నీ స్టాక్.

స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన టెక్స్టైల్ సెక్టార్ స్టాక్ అయిన ఆర్&బీ డెనిమ్స్ లిమిటెడ్ కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ ఇటీవల సమావేశమై తమ షేర్ హోల్డర్స్ కి 1:2 రేషియోలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలుపడం జరిగింది. అయితే తాజాగా నిన్న సమావేశంలో ఈ బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డు డేట్ ని బోర్డు నిర్ణయించడం జరిగిందని కంపెనీ తమ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిపింది.

నిన్న జరిగిన ట్రేడింగ్ సెషన్ లో ఆర్&బీ డెనిమ్స్ లిమిటెడ్ షేరు ధర 5 శాతం నష్టపోయి రూ. 75.24 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 203 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 75.24 లుగా ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు ధర సుమారు 19 శాతం నష్టాన్ని, గత ఆరు నెలల్లో సుమారు 35 శాతం నష్టాన్ని తమ వాటాదారులకి అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ. 677 కోట్లుగా ఉంది.

 

RSS
Follow by Email
Latest news