ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అక్షయ్ కుమార్. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనితో పాటు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న మల్టీస్టారర్ ‘గోల్‌మాల్ 5’ లో కూడా అక్షయ్ నటిస్తున్నారు. రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ వంటి మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ‘స్త్రీ’ వంటి హారర్ కామెడీలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని అక్షయ్ కుమార్ అన్నారు. సమకాలీన సినిమాలపై స్పందిస్తూ.. ప్రస్తుతం ట్రెండ్ మారుతోందని అయన వివరించారు.
ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్,జ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఇంట్లో గ్యాస్ కొరత లేదు కానీ, ముందు జాగ్రత్తగా నా భార్య ట్వింకిల్ ఖన్నా ఇప్పటికే రెండు ఇండక్షన్ స్టవ్‌లను (Electric Stoves) ఆర్డర్ చేసిందని తెలిపారు. అవి ఇంటికి డెలివరీ అయ్యాయో లేదో నాకు తెలియదు కానీ, యుద్ధం తెచ్చిన తిప్పలు తో వంట గ్యాస్ కొరత వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా చర్యగా వీటిని ఆర్డర్ చేసినట్లు అయన వివరించారు.
కేవలం అక్షయ్ మాత్రమే కాదు, మీరు కూడా ఇలాంటి బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకోవడం మంచిదని అభిమానులకు చమత్కారంగా సలహా ఇచ్చారు. గ్యాస్ కొరతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి యుద్ధం తెచ్చిన తిప్పలు అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలను కూడా “స్టవ్”ల గురించి ఆలోచించేలా చేశాయంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.











