Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నందిగామలో కేంద్రీయ విద్యాలయం.. ఏర్పాటు

దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేయగా వాటిలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఒకటిగా ఉంది. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి నందిగామ కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తాత్కాలికంగా నందిగామలోని మహిళా పాలిటెక్నిక్ ట్రైనింగ్ సెంటర్ నందు కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు అనుమతి ఇచ్చింది.

తాజా ఘటనతో నందిగామ ప్రాంత వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య సహకారంతో విశేష కృషి చేశారు.  నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సైతం ఎంపీ విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు నియోజకవర్గంలోని పల్లగిరి ప్రాంతంలో 5 ఎకరాల మేర స్థల గుర్తింపు ఆ స్థలాన్ని కేంద్రియ విద్యాలయ సంస్థకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.

స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, రెవిన్యూ ఉన్నతాధికారులతో కలిసి స్థల పరిశీలనను ఎంపీ కేశినేని శివనాద్ చేశారు. ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాలయం ద్వారా 2026-27 విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతాయని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్ ) దీపేష్ గెహ్లాట్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

RSS
Follow by Email
Latest news