తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ ని కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ… “గౌరవ ముఖ్యమంత్రి ని ఈ పవిత్ర రంజాన్ మాసంలో మార్చి 15న జరిగే ఇఫ్తార్ విందుకు ఆహ్వానించానన్నారు. ఈ పవిత్ర సమయం అందరిలో శాంతి, కృతజ్ఞత, ఐక్యతను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని తెలిపారు.
ఈ మాసంలో నాయకులు, ప్రముఖులు మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి అజారుద్దీన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.











