Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బోరబండలో విషాదఘటన.. ఇద్దరు పిల్లల గొంతునులిమి.. తల్లి ఆత్మహత్య..

హైదరాబాద్ నగరంలోని బోరబండ పెద్దమ్మనగర్‌లో విషాదఘటన చోటుచేసుకుంది. సత్యవాణి అనే గృహిణి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. తనూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఈ ఘటనలో ఐదేళ్ల కుమారుడు మృతిచెందగా, రెండేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కుటుంబ కలహాలతో ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

RSS
Follow by Email
Latest news