Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ..

హైదరాబాద్ నగరంలో పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయడం తో పాటు… పౌరులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల మార్చి 31వ తేదీలోగా తమ ఆస్తి పన్ను బకాయిలను చెల్లించే వారికి వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఎండింగ్ లో ఉన్న ఆస్తిపన్ను తో పాటు 10 శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి నిజంగా ఇది అదిరిపోయే శుభవార్త.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించి ఈ 90 శాతం వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 31 తర్వాత ఈ అవకాశం ఉండదని, గడువులోపు చెల్లించి అదనపు భారం తగ్గించుకోవాలని అయన సూచించారు.

నగరవాసులు తమ బకాయిలను చెల్లించేందుకు ghmc అధికారిక వెబ్‌సైట్ www.ghmc.gov.in ద్వారా నేరుగా చెల్లించవచ్చు. లేదా MyGHMC యాప్ ద్వారా సులభంగా పేమెంట్ చేయవచ్చు. మీ-సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ల (CSC)లో కూడా బకాయిలు కట్టే వెసులుబాటు ఉందని కర్ణన్ తెలిపారు.

RSS
Follow by Email
Latest news