Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

“బులెట్ రెడ్డి” మూవీ అప్డేట్ ఇదే !

శ్రీ లక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై ఆది దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న ఈ చిత్రం ‘బుల్లెట్ రెడ్డి’. ఈ చిత్రం 2026 జనవరి 2 ప్రారంభమైంది. ఇప్పటికి రెండు షెడ్యూలు పూర్తి చేసుకున్నట్లు ఈ మూవీ దర్శక నిర్మాత హీరో ఆది తెలిపారు. గురువారం రోజున జరిగిన ప్రెస్ మీట్ లో ఈ చిత్రానికి సంబందించిన పూర్తీ అయన వెల్లడించారు. చిత్ర దర్శక నిర్మాత ఆది, మేఘ, హనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బుల్లెట్ రెడ్డి’.  రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఒక సాంగ్ కూడా పూర్తయిందని, అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫైట్ సీన్స్ తీసినట్లు హీరో అది వెల్లడించారు.  ఈ చిత్రం మూడవ షెడ్యూల్ మార్చి 23 నుండి రాజమండ్రి అమలాపురం పరిసర ప్రాంతాల్లో జరుపుకొనుంది. అలాగే నిజామాబాద్ అదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ జరుపనున్నట్లు అయన తెలిపారు.

తదుపరి షెడ్యూల్ గోవా పరిసర ప్రాంతాల్లో సాంగ్స్ చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాత డైరెక్టర్ తెలిపారు. ఈ చిత్రం సక్సెస్ సాధించినట్లైతే, తదుపరి తాను తీయబోయే చిత్రాల్లో నేను రైటర్ గా ఉండి కొత్త ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తానని ఆయన తెలిపారు. ఈ చిత్రం దసరా సందర్భంగా రిలీజ్ చేస్తున్నాము కాబట్టి మా చిత్రం ఎవరికీ పోటీ లేదు ఎవరికి కాంపిటీషన్ కూడా కాదు అని హీరో అది స్పష్టం చేశారు.

RSS
Follow by Email
Latest news