ది హండ్రెడ్ వేలం పాటలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు కోట్లు) సచేసింది. ఆతరువాత కొన్ని గంటలకే సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఎక్స్ ఖాతా సస్పెన్షన్‌కు గురైంది. ఈ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ.2.34 న్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఈ పోటీలో భారత్‌కు చెందిన ఫ్రాంచైజీలో చోటు దక్కించుకున్న తొలి పాకిస్థాన్ క్రికెటర్‌గా అబ్రార్ అహ్మద్ రికార్డ్ నెలకొలిపాడు.
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కు చెందిన ఫ్రాంచైజీ ఒక పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై కొందరు భారత అభిమానులకు నచ్చలేదు. దింతో భారత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును బహిష్కరించాలనే డిమాండ్ చేశారు.
ఈ వార్త కాస్తా… ఎక్స్ వేదికగా వైరల్ అయింది. అలాగే ఫ్రాంచైజీతోపాటు సహ యజమాని కావ్య మారన్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఎక్స్ సంస్థ సన్ రైజర్స్ లీడ్స్ ఖాతా సస్పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. కానీ ఆ ఖాతాను తెరవడానికి ప్రయత్నించిన వినియోగదారులకు Account suspended. X suspends accounts that violate the X rules అనే సందేశం కనిపించింది.











