Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పోలీసులను ఆశ్రయించి… ప్రియుడిని పెళ్లాడిన నటి మోనాలిసా..

మోనాలిసా భోస్లేఅనే యువతీ ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించింది .  ఆమె తాజాగా వివాహహం  చేసుకుంది . ఆమెకు సినీ అవకాశాలు కూడా  వస్తున్నాయి . ఇప్పుడు.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి, అందరినీ ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌ తో ఫర్మాన్ ఖాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఫేస్‌బుక్‌లో మొదలైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. గత ఎనిమిది నెలలుగా వీరు ప్రేమలో ఉన్నారు.

కేరళలో షూటింగ్‌ కోసం వెళ్లిన మోనాలిసాను ఇంటికి తీసుకొచ్చేందుకు ఆమె తండ్రి అక్కడకు చేరుకున్నారు. తండ్రి రాకను గుర్తించిన మోనాలిసా.. ఫర్మాన్‌తో కలిసి పోలీసులను బుధవారం మధ్యాహ్నం ఆశ్రయించారు. తండ్రి నుంచి ప్రాణహాని ఉందని, ఆయన నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం, పెళ్లి చేసుకున్నారు. ‘నాగమ్మ’ (మలయాళం)తోపాటు తెలుగులో ‘లైఫ్‌’ సినిమాలో మోనాలిసా నటిస్తున్నారు.

 

 

RSS
Follow by Email
Latest news