Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది.. కేజ్రీవాల్ కొంప కొల్లేరయింది : ఎంపీ రఘునందన్

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది కేజ్రీవాల్ కొంప కొల్లేరైంది. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందనేది ఈరోజు  ఫలితాలు నిరూపించాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఢిల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్   అని అన్నారు . అదే కేజ్రీవాల్ కొంపముంచిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే పోరాటం చేస్తే.. ఆయన శిబిరం నుంచి వచ్చిన కేజ్రీవాల్ పార్టీ పెట్టాడని చెప్పారు. ఇప్పుడు అదే అవినీతి కేజ్రీవాల్ ని చీపురుతో ఊడ్చేశారని అయన ఆరోపించారు.  లిక్కర్ స్కాం అనే భూతం ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్  పార్టీని, అక్కడ కేజ్రీవాల్ పార్టీని ముంచిందన్నారు.   లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులంతా అవినీతిలో కూరుకుపోవడం వల్లే  ప్రజల ఆగ్రహానికి గురైనారని రఘునన్ద తెలిపారు .

RSS
Follow by Email
Latest news