తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు…పేరుతొ అక్రమ కట్టడాలను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో కూడా అక్రమ నిర్మాణాలను తొగగిస్థానమి మంత్రి నారాయణ తెలిపారు. కాలువ ఆక్రమణలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బుడమేరు ఆక్రమణలతోనే విజయవాడకు భారీ వరద వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
రేపుజరగనున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో పర్యటిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ లా కాలేజ్, డంపింగ్ యార్డ్, టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని అయన తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.