Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బిగ్‎బాస్‏ సీజన్ 8 ప్రారంభం…!

బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానేవచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. ఈ సారి మరింత ప్రత్యేకంగా రంగంలోకి దిగుతోంది. ఈరోజు హౌస్ లోకి 14 మంది అడుగుపెట్టనున్నారు.. అందులో ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు ఉండనున్నారు. అయితే ఈసారి హౌస్ లోకి సోలో ఎంట్రీ కాకుండా జంటగా పంపిస్తున్నారు. ప్రేరణ, యష్మి, బెజవాడ బేబక్క , కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్ మరికాసేపట్లో హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే వీళ్లంతా కేవలం ప్రోమో ప్రకారం మాత్రమే తెలుస్తోంది. అయితే వీళ్లంతా జంటగా ఉంటారా..? లేదా ? తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‎బాస్‏ చివరి నిమిషంలో ఓ కంటెస్టెంట్ ఆగిపోయాడని తెలుస్తోంది.

మొత్తం 14 మందిలో నటుడు పరమేశ్వర్ హివ్రాలే పేరు కూడా గట్టిగా వినిపించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంతో బిగ్‎బాస్‏ షో స్టార్ట్ కాకముందే చివరి నిమిషంలో ఆగిపోయాడట. చివరి నిమిషంలో అతడు తప్పుకున్నట్లు సమాచారం. గత పదేళ్లుగా పరమేశ్వర్ తెలుగు సినీరంగంలో ఉన్నాడు. చిన్న సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు అంతగా గుర్తింపు రాలేదు . చిరు గొడవలు, కుమారి 18+, లావణ్య విత్ లవ్ బాయ్స్, జాతీయ రహదారి లాంటి సినిమాల్లో నటించాడు. ఇల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ కు దర్శకత్వం  కూడా చేశాడు .  దీంతో అతడి స్థానంలోకి యూట్యూబర్ నబీల్ అఫ్రిదిని తీసుకువస్తున్నారు. యూట్యూబర్ ఈ షోను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

RSS
Follow by Email
Latest news
సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌ గ్రేటర్ హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డీసీపీల బదిలీలు సౌతాఫ్రికా అండర్‌-19 పై భారత్ అండర్ - 19 జట్టు క్లీన్‌స్వీప్ జనవరి 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు...? కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు